• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

బోయపాటి-చరణ్ సినిమాకు శ్రీకారం చుట్టేసిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఇప్పుడే షూట్ కు వచ్చే పరిస్థితి లేదు. అందుకే సినిమాలో వున్న కొన్ని క్యారెక్టర్లతో తొలి షెడ్యూలు లాంఛనం పూర్తి చేసారు. జస్ట్ ఎనిమిది రోజుల పాటు అలా అలా కొన్ని సీన్లు ముహుర్తాలు, నమ్మకాల కోసం కానిచ్చేసి, బ్రేక్ ఇచ్చేసారు.

ప్రస్తుతం రంగస్థలం పని మీద అవుట్ డోర్ కు వెళ్లి వచ్చిన రామ్ చరణ్ ఇంకో పది హేను రోజులు బిజీగా వుంటారు. అందువల్ల ఫిబ్రవరి ద్వితీయార్థం వరకు అందుబాటులో వుండడు.

సో, బోయపాటి తన సినిమా తరువాతి షెడ్యూలును ఫిబ్రవరి 15తరువాతే ప్లాన్ చేసుకోవాలి. రంగస్థలం సినిమాకు ఇక ఈ గెడ్డం గెటప్ అక్కర్లేదు, కాపీ ఫైనల్ అయిపోయింది అన్న విషయం రూఢీ అయిన తరువాతే చరణ్ గెటప్ మారుస్తారు.

అయితే ఈ సెకెండ్ షెడ్యూలు కూడా మరీ పెద్దగా వుండకపోవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే మళ్లీ మార్చిలో రంగస్థలం ప్రమోషన్ పనులు వుంటాయి.

రామ్ చరణ్ వచ్చేవరకు బోయపాటి వెయిటింగ్ లో వుండాలి. ఆపైన షూటింగ్ కు వెళ్లాలి. ఈ లోగా సైరా వ్యవహారాలు, రంగస్థలం పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద టైమ్ స్పెండ్ చేస్తాడు రామ్ చరణ్.Note: Please DO NOT use ABUSIVE language in comments.