• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ తొలి విడత పర్యటన పూర్తయినప్పటికీ.. అతడిపై విమర్శల విడత మాత్రం ఇంకా పూర్తవ్వలేదు. రోజుకో కాంగ్రెస్ నేత పవన్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఓసారి పవన్ పై విరుచుకుపడిన రేవంత్ రెడ్డి, తాజాగా మరోసారి పవన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ను సహజ నటుడిగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి, పవన్ ను సినీనటుడిగా చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరూ కలిసి తెలంగాణ ప్రజల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నారని చెప్పిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు పవన్ పావుగా మారారని విమర్శించారు. కేసీఆర్ పాలన బాగుందని మెచ్చుకుంటున్న పవన్, తెలంగాణలో పర్యటనలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు రేవంత్.

తెలంగాణలో పవన్ పర్యటన.. మేకప్, పేకప్ మధ్య జరిగే షూటింగ్ లాంటిదేనని విమర్శించారు. వీహెచ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సంబంధించి పవన్ ను తన సొంత ఖర్చుతో ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్ తో భేటీ ఏర్పాటుచేస్తానని గతంలో చెప్పానని, దానిపై జనసేన అధ్యక్షుడు ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్పలేదని అంటున్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కారని, వాళ్లకు రాజకీయాలకు సినిమాలకు తేడా తెలుసని.. రాబోయే ఎన్నికల్లో పవన్ ఫ్యాన్స్ ఎవరూ అతడికి ఓట్లు వేయరని అంటున్నారు రేవంత్.

మరోవైపు తెలంగాణలో తొలి విడత పర్యటన పూర్తిచేసిన పవన్.. రేపట్నుంచి అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నారు. జనసేన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. కదిరి, ధర్మవరంలో జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ 3రోజుల కరువు యాత్రలో పలువురు రైతులు, చేనేత కార్మికులతో మాట్లాడతారు



Note: Please DO NOT use ABUSIVE language in comments.