• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

అనుష్క ప్రభాస్ లది అదిరిపోయే జోడి. ఇప్పటివరకూ మూడు సినిమాల్లో జోడి కట్టారు ప్రభాస్ ,అనుష్క. బిల్లా , మిర్చి , బాహుబలి. ఈ మూడు కూడా సూపర్ హిట్లే. బాహుబలి ఐతే ఏకంగా సంచలనం సృష్టించింది. దేవసేనగా ప్రభాస్ భుజాలెక్కేసింది స్వీటీ. బాహుబలి అంత గ్రాండ్ గా పడింది వీరి కెమిస్ట్రీ. ఇప్పుడు మరోసారి వెండితెర సందడి చేయడానికి రెడీ అయిపోయారు అనుష్క, ప్రభాస్

ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ జోడి ఎప్పుడూ హాట్ టాపిక్ నే. ప్రభాస్ అనుష్క లవ్ లో వున్నారని, పెళ్లి కూడా చూసుకుంటారని బోలెడు గాసిప్పులు. అయితే తమది స్నేహమని చెప్పుకొచ్చిందీ జోడి. కాగా ఈ విషయంలో ప్రభాస్ తాజాగా మరో స్పదించాడు. ”ఒక హీరోయిన్ తో వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య రిలేషన్‌ ఉంది అనే వార్తలు వెలువడటం సహజమే. నాకు అనుష్కకు కూడా అదే జరిగింది. కానీ నేను అనుష్క ఇప్పటికీ ఎప్పటికీ మంచి స్నేహితులమే’ అని చెప్పుకొచ్చాడు ప్రభాస్.


Note: Please DO NOT use ABUSIVE language in comments.