• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

2017 ఏడాదికి బై..బై చెపుతూ నూతన ఏడాది కి గ్రాండ్ గా స్వాగతం పలికినెదుకు మందు బాబులు భారీగానే ఖర్చు చేసినట్లు లెక్కల్లో తేలింది. హైదరాబాద్ జిల్లాల్లో రూ.90 కోట్లు ఖర్చు చేస్తే..మిగతా జిల్లాల్లో రూ.70 కోట్లు కేవలం మద్యానికి ఖర్చు పెట్టారట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరిచిఉండడం, డిసెంబర్ 31 వేడుకలు ఆదివారం రావడం రావడం తో ఈ ఒక్కరోజే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయట. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.50 కోట్ల విలువైన మద్యం అమ్ముడవగా, రెండోస్థానంలో రాజధాని హైదరాబాద్ ఉంది.

హైదరాబాద్ జిల్లాలో 40 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో 70 కోట్ల మద్యం అమ్ముడైనట్లు సమాచారం. ఈ మద్యం అమ్మకాల్లో బీర్ల అమ్మకాలు గత ఏడాది తో పోలిస్తే బాగా తగ్గిందట. కేవలం 5 శాతం మాత్రమే బీర్లు అమ్ముడుపోయినట్టు వ్యాపారవర్గాలు చెపుతున్నాయి. 95 శాతం లిక్కర్ అమ్మకాలే జరిగాయట. మొత్తానికి న్యూ ఇయర్ సందర్భాంగా మద్యం షాపులకు భారీ లాభాలే వచ్చినట్లు సమాచారం.


Note: Please DO NOT use ABUSIVE language in comments.