• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

'బాహుబలి ది కంక్లూజన్‌' థియేటర్లలో సందడి చేయడానికి 'సాహో' టీజర్‌ వచ్చేసింది. ఓ పక్క 'బాహుబలి' మేనియా, ఇంకో వైపు 'సాహో' టీజర్‌ హంగామా.. వెరసి, అభిమానులకు 'డబుల్‌ థమాకా' ఇస్తున్నాడు ప్రభాస్‌. తెలుగు రాష్ట్రాల్లోనే కాక, యావత్‌ భారతదేశమంతటా ఇప్పుడు 'బాహుబలి' మేనియానే కన్పిస్తోంది. విదేశాల్లోనూ 'బాహుబలి' మేనియాలో ఊగిపోతున్నారు సినీ అభిమానులు. 

సరిగ్గా టైమ్‌ చూసి, 'సాహో' టీజర్‌ని విడుదల చేశారు. అలా ఇలా కాదు, 'బాహుబలి ది కంక్లూజన్‌' కోసమే అన్నట్లుగా, ఇందులో ప్రభాస్‌తో 'ఇట్స్‌ షో టైమ్‌..' అని చెప్పించేశాడు దర్శకుడు సుజీత్‌. ఏదో చిన్న సినిమా అనుకునేరు, ఇది చాలా పెద్ద సినిమాలా వుంది. 'బాహుబలి ది బిగినింగ్‌'తో పోటీ పడ్తుందా.? అన్న పోలికల్ని పక్కన పెడితే, ప్రభాస్‌ కెరీర్‌లో మరో మైలు రాయి అయ్యేలా భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. 

టీజర్‌లోనే సినిమాలోని భారీతనాన్ని చూచాయిగా చూపించేయడం గమనార్హం. నీటిలో చేపలా ఈదుతున్న అందాల భామ.. జూమవుట్‌లో భారీ భవంతుల మధ్య నీటి కొలను.. అదంతా జూమవుట్‌ చేస్తే, చివరికి ఓ కన్ను.. టెక్నికల్‌గా టీజర్‌ అదిరిపోయిందంతే. టీజర్‌ చివర్లో, జెట్‌ ప్యాక్‌లతో భారీ భవంతులపైనుంచి కిందికి దూకేసి, జెట్‌ వేగంతో గాల్లోకి దూసుకుపోవడం.. ఈ టీజర్‌కి మరో హైలైట్‌గా చెప్పుకోవాలి.



Note: Please DO NOT use ABUSIVE language in comments.