• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

అంతకు ముందు వరకూ ఓ లెక్క, ఆ తర్వాత ఇంకో లెక్క.. అంటోంది ’రత్తాలు‘. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో చేసిన ఆ ఒక్క ఐటమ్‌ సాంగ్‌ తన ఇమేజ్‌ని పూర్తిగా మార్చేసిందంటూ 'రత్తాలు' తెగ మురిసిపోతోంది. మామూలుగా అయితే, సినిమా అయిపోయాక కొత్త సినిమా మీద కబుర్లు షురూ చేస్తుంటారెవరైనా. కానీ, ఇంకా 'రత్తాలు' మాత్రం 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాని మర్చిపోవట్లేదు. చిరంజీవి హీరోగా వచ్చిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో 'రత్తాలు' ఐటమ్‌ సాంగ్‌ ఆ రేంజ్‌లో ఊపేసింది మరి.! 

అసలు విషయానికి వస్తే, లక్ష్మీ రాయ్‌ పేరుని కాస్తా, లక్కు కోసం రివర్స్‌ చేసేసి రాయ్‌ లక్ష్మీ అయిపోయిన ఈ 'రత్తాలు', లేటెస్ట్‌గా మియామీ బీచ్‌లో అందాలు ఒలకబోసేసింది. అలా బీచ్‌లో అందాలు ఒలకబోసేసిన వైనాన్ని, ఇలా ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టి అభిమానుల్లో హీట్‌ పెంచేస్తోంది. ప్రస్తుతం రాయ్‌ లక్ష్మీ, హిందీలో 'జూలీ-2' సినిమా చేస్తోంది. చాలాకాలం క్రితం నేహా ధూపియా ప్రధాన పాత్రలో వచ్చిన 'జూలీ' అప్పట్లో పెద్ద విజయమే సాధించింది. 

అన్నట్టు, 'జూలీ-2' సినిమా కోసం రికార్డ్‌ స్థాయిలో బికినీలు ధరించేసిందట లక్ష్మీ రాయ్‌ అలియాస్‌ రాయ్‌ లక్ష్మీ. ఒక్కో బికినీలో ఒక్కో స్పెషల్‌ వుందంటూ అభిమానుల్ని ఊరించేస్తోందనుకోండి.. అది వేరే విషయం.



Note: Please DO NOT use ABUSIVE language in comments.