• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

మెగాస్టార్‌ చిరంజీవితో హీరోయిన్‌గా మంచి జోరు మీదున్న టైమ్‌లో రోజా ఏ రేంజ్‌లో స్టెప్పులేశారో చూశాం. 'ముఠామేస్త్రి', 'ముగ్గురు మొనగాళ్ళు', 'బిగ్‌బాస్‌' తదితర సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. డాన్సుల్లో ఒకరితో ఒకరు పోటీ పడ్డారన్నది నిర్వివాదాంశం. మళ్ళీ ఈ ఇద్దరూ ఇప్పుడు తెరపై కన్పిస్తే, ఓ పాటకి డాన్సులేస్తే ఎలా వుంటుంది.? సినిమాల్లో ఏమో, అది సాధ్యమవుతుందో లేదోగానీ, బుల్లితెరపై మాత్రం.. ఇద్దరూ కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో పండించేశారు. 

'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్‌ షో కోసం రోజా హాట్‌ సీట్‌లో దర్శనమిస్తే, హోస్ట్‌గా చిరంజీవి ఆద్యంతం ఈ ప్రోగ్రామ్‌ని రక్తి కట్టించేశారు. రోజాతో స్టెప్పులేశారు, రోజాతో కామెడీ పండించారు. అలా ఇలా కాదు, చిరంజీవి - రోజా.. ఇద్దరూ ప్రస్తుత వయస్సుని పక్కన పడేశారు. ఒకప్పటి రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారు. అన్నట్టు, మీతో మళ్ళీ నటించే ఛాన్స్‌ ఎప్పుడు.? అని రోజా అడిగేయడంతో, 'ఏమో, అన్నీ కలిసొస్తే త్వరలోనే కుదురుతుందేమో..' అంటూ చిరంజీవి సమాధానమిచ్చారు. 

రోజా అయితే, దాదాపుగా చిరంజీవి తదుపరి సినిమాలో బెర్త్‌ కన్‌ఫామ్‌ చేసుకున్నట్లే ఫిక్సయిపోయారు. అఫ్‌కోర్స్‌, ఇదంతా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్‌ షో హడావిడి మాత్రమేననుకోండి.. అది వేరే విషయం. అన్నట్టఉ, ఇదే వేదికపై నాని అడగ్గానే, సైకిల్‌ కొనిచ్చినట్లు.. చిరంజీవి, రోజాకి ఆఫర్‌ ఇచ్చే విషయంలోనూ డెసిషన్‌ తీసేసుకున్నారేమో. చిరంజీవి తదుపరి సినిమా సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో వుంటుందనీ, అది 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' చిత్రమేననీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

కొసమెరుపు: రాజకీయంగా చిరంజీవి పేరు చెబితే, విరుచుకుపడిపోయే రోజాయేనా.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు‘ కోసం, ఇలా చిరంజీవి దగ్గర చిన్న పిల్లలా సందడి చేసేసింది.?



Note: Please DO NOT use ABUSIVE language in comments.