• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

బాలీవుడ్ లో బాహుబలి-2 ప్రీమియర్స్ రద్దయ్యాయి. ఈరోజు రాత్రి 9గంటలకు ముంబయిలో ఏర్పాటుచేసిన స్పెషల్ స్క్రీనింగ్ ను రద్దుచేస్తున్నట్టు బాహుబలి సమర్పకుడు కరణ్ జోహార్ ప్రకటించాడు. బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో, కరణ్ జోహార్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సో.. ప్రీమియర్ లేకుండానే బాహుబలి-ది కంక్లూజన్ సినిమా బాలీవుడ్ లో విడుదలకానుంది.

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది బాహుబలి-2 సినిమా. ఈ రోజు రాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్స్ కు భారీ ఏర్పాట్లు చేసింది యూనిట్. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో బాహుబలి-2ను క్లిక్ చేసేందుకు అక్కడి ప్రీమియర్ పై ఎక్కువ దృష్టిపెట్టింది. బాహుబలి యూనిట్ కూడా ఎక్కువగా బాలీవుడ్ లోనే ప్రచారం చేసింది. కానీ ఆఖరి నిమిషంలో కీలకమైన ప్రీమియర్ నిలిచిపోయింది.

ఈ ప్రీమియర్ కనుక పడి ఉంటే, బాలీవుడ్ తారలందరితో ట్వీట్స్ చేయించి, సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేద్దామనుకున్నాడు కరణ్ జోహార్. అలా ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డు సృష్టించాలనుకుంది బాహుబలి యూనిట్. కానీ వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో బాహుబలి-2 ముంబయి ప్రీమియర్ కాన్సిల్ అయింది.



Note: Please DO NOT use ABUSIVE language in comments.