• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

దాదాపు నెల రోజులుగా ఆంధ్ర, తెలంగాణల్లో థియేటర్లు బోసి పోయి వున్నాయి. థియేటర్లు లీజుకు ఇచ్చిన వాళ్లు బాగానే వున్నారు. కానీ లీజుకు తీసుకున్నవాళ్లకు మాత్రం ఈ నెల రోజులు చుక్కలు కనిపించాయి. సినిమాల నుంచి వచ్చే అద్దెలు ఓ మాదిరిగానే రావడం, క్యాంటీన్, సైకిల్ స్టాండ్ వంటి ఆదాయాలు లేకపోవడంతో గిలగిలలాడారు.

అలాంటి వాళ్లకు ఇప్పుడు సంక్రాంతి పండుగ రేంజ్ లో వుంది సంబరం. బాహుబలి పుణ్యమా అని థియేటర్ల మీదకు జనం టికెట్ ల కోసం ఎగబతున్నారు. ఎలా కాదన్నా మూడు రోజులు దాదాపు ఫుల్స్ గ్యారంటీ. దీంతో క్యాంటీన్లు, పార్కింగ్ స్టాండ్ లు కళకళ లాడతాయి. మరోపక్క టికెట్ లు యూనిఫారమ్ రేటు ఒకటి. అదే సమయంలో యాభయ్యో, వందో టికెట్ లు దొడ్డి దోవన అమ్ముకుంటే కాసిన్ని డబ్బులు వస్తాయి.

మొత్తం మీద ఇప్పుడు థియేటర్లకు మరోసారి సంక్రాంతి వచ్చినట్లయింది. ఈ సంక్రాంతి సంబరం ఎన్ని రోజులు వుంటుందన్నది బాహుబలి సక్సెస్ పై ఆధారపడి వుంటుంది.



Note: Please DO NOT use ABUSIVE language in comments.