• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి జై లవకుశ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ మాత్రం అధికారికంగా ఎనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా ఇంటర్నెట్ లో లీకైన ఓ ఫొటో మాత్రం తారక్ కొత్త సినిమా టైటిల్ అదేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.

ఎన్టీఆర్, హరికృష్ణ ఉన్న ఈ ఫొటోనే ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇందులో తారక్ ముందున్న నేమ్ ప్లేట్ చూశారా... ఆ పేరు ఎన్.లవ కుమార్. అంటే.. సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్న ఓ పాత్ర పేరు లవకుమార్ అన్నమాట. జై లవకుశ అనే టైటిల్ లో జై, లవ కుమార్, కుశాల్ అనే 3 పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఓ పాత్ర పేరు ఇప్పుడు పక్కా అయింది. సో.. టైటిల్ కూడా జై లవకుశ. ఇది ఫిక్స్.

మహేష్-కొరటాల సినిమా విషయంలో కూడా ఈమధ్య ఇలానే జరిగింది. ఆ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్.. పొరపాటున ట్విట్టర్ లో సినిమా పేరును ఎనౌన్స్ చేసేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా టైటిల్ ఏంటనేది ఈ ఫొటో ద్వారా తెలిసింది.



Note: Please DO NOT use ABUSIVE language in comments.