• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

సినిమా అనేది ఓ కళ.. ఆ కళకి హద్దుల్లేవ్‌.. అంటుంటారు సినీ ప్రముఖులు. కానీ, కొన్ని సినిమాలు చూస్తే 'సినిమా అనేది కళ' అన్న విషయాన్ని ఒప్పుకోడానికే సిగ్గుపడాల్సి వుంటుందేమో.! 'దేవిశ్రీప్రసాద్‌' సినిమా కూడా అలాంటిదే కావొచ్చు. ప్రస్తుతానికైతే టీజరే బయటకొచ్చింది. 'శవంతో సెక్స్‌' ఈ సినిమా టీజర్‌లో కన్పిస్తోన్న మెయిన్‌ ఎలిమెంట్‌. 

ఇంగ్లీషులోనో, ప్రపంచంలోని ఇతర భాషల్లోనో ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఆ పైత్యాన్ని మన తెలుగులోకి కూడా తీసుకొచ్చేస్తున్నారు. పైగా, రాక్‌ స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ పేరుని ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టేసుకున్నారు. ఇదింకా దారుణం. అన్నట్టు, 'రాక్‌ స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ కాదు.. రోగ్స్‌ దేవి, శ్రీ, ప్రసాద్‌..' అంటూ పోసాని కృష్ణమురళితో ఓ డైలాగ్‌ చెప్పించేశారండోయ్‌. క్రియేటివిటీ అదిరిపోయింది కదూ.! 

అయినా శవంతో సెక్స్‌ ఏంటి.? ఇదేం క్రియేటివిటీ.? సిగ్గు సిగ్గు.! సోషల్‌ మీడియాలో ఈ సినిమా టీజర్‌ని ఉతికి ఆరేసేస్తున్నారు నెటిజన్లు. కామెడీని మిక్స్‌ చేసేయడం సంగతెలా వున్నా, థ్రిల్లర్‌ జోనర్‌లో.. ఇంతకుముందు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఏ సినిమా రాలేదంటూ ప్రచారం షురూ చేసేసేలా వుంది 'దేవిశ్రీప్రసాద్‌' టీమ్‌. ఒక్కటి మాత్రం నిజం.. జుగుప్స.. అన్న మాటకే పరాకాష్ట ఇందులోని కాన్సెప్ట్‌. సెన్సార్‌ ఈ సినిమానెలా బయటకు రానిస్తుందో ఏమో వేచి చూడాల్సిందే.



Note: Please DO NOT use ABUSIVE language in comments.