• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

సహజ నటి జయసుధ అన్ని విషయాల్లో సంతృప్తికరమన విజయాలు సాధించారు. నటిగా, రాజకీయ నాయకురాలిగా, ఓ మహిళగా ఇలా అన్ని విధాలుగా. కానీ గడచిన కొంత కాలంగా ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం చాలా ఒడిదుడుకులకు గురయింది. ముఖ్యంగా ఏ పనీ తనకు లేదని, ఆమె భర్త నితిన్ కుమార్ ఓ విధమైన డిప్రెషన్ కు గురి కావడం ఆమెను చాలా ఇబ్బంది పెట్టినట్లు వినికిడి. ఈ క్రమంలో ఆమె కొన్ని ఆస్తులను అమ్మేసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. భర్త డిప్రెషన్ కు ట్రీట్ మెంట్, అదే విధంగా అతన్ని కట్టడి చేయాల్సిన పరిస్థితులతో ఆమె చాలా సతమతమయినట్లు తెలుస్తోంది. అందుకోసమే ఏ సినిమాలో అవకాశం వచ్చినా జయసుధ వదులుకోకుండా చేస్తూ వచ్చారు. ఇటీవల ఓ సినిమాలో నటించడంపై కొందరు సన్నిహితులు అభ్యంతరం చెప్పగా, తనకు ఈ దశలో పారితోషికం చాలా అవసరం అని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.  

ఈ దశలో, ఆమె కట్టడి చేయడంతో, తాను డైవోర్స్ ఇస్తానని నితిన్ కపూర్ ఓ దశలో బెదిరించినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసి, దర్శకుడు దాసరి నారాయణరావు, మరో సీనియర్ హీరో పిలిచి ఆయనకు నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వయసులో ఇలాంటి పనుల తగదని వారించినట్లు తెలిసింది.భర్త అంటే కాస్తఅటాచ్ మెంట్ ఎక్కువ అని సన్నిహితులు చెబుతున్నారు.

తమ కుటుంబ సభ్యుల మాట కన్నా, సోదరి మాట నితిన్ కపూర్ ను కొంత కంట్రోల్ చేయగలగడంతో, తరచు ముంబాయిలోని సోదరి ఇంట్లో వుంచుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా అలాగే అక్కడకు పంపినట్లు, ఓ పెళ్లి కూడా వుండడంతో అక్కడే వున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఇద్దరు పిల్లలు ఇంకా సెటిల్ మెంట్ దశలో వుండగా ఇలా జరగడం పాపం, జయసుధ కు తట్టుకోవడం కాస్త కష్టమే.



Note: Please DO NOT use ABUSIVE language in comments.