• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

కొన్నినెలల కిందట సంచలనం రేపిన తనూశ్రీ దత్తా కేసును క్లోజ్ చేసినట్టుగా ప్రకటించారు ముంబై పోలీసులు. తనను లైంగిక వేధింపులకు గురి అయినట్టుగా తనూశ్రీ ఫిర్యాదు చేసింది తెలిసిందే. బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్ మీద ఆమె ఆరోపణలు చేసింది. ఏదో ఒక సినిమా షూటింగ్ సందరర్భంగా నానా పటేకర్ తనను వేధించినట్టుగా తనూశ్రీ చెప్పింది. సంచలన రీతిలో ఆరోపణలు చేసింది తనూశ్రీ. ఆమె దెబ్బకు ఇండియాలో 'మీ టు' ఉద్యమం ఊపందుకుంది.

అనేకమంది ఆమె స్ఫూర్తితో లైంగిక వేధింపుల ఆరోపణలు చేయసాగారు. పలువురు బాలీవుడ్ మూవీ మేకర్లు, నటులపై ఆ ఆరోపణలు వచ్చాయి. ఆ వేడి మీద కొందరి కెరీర్ లకే ఇబ్బందులు వచ్చాయి. మీ టు ఉద్యమంతో కేంద్రమంత్రి ఎంజే అక్బర్ పదవిని కోల్పోయాడు. అనేకమంది మహిళలు ఆ విషయంలో స్పందించసాగారు.

అలాంటి ఉద్యమం అంత మొదలుకు కారణం తనూశ్రీనే. అమెరికా నుంచి వచ్చి తన మారిపోయిన లుక్ తో మొదట ఆశ్చర్య పరిచిన తనూశ్రీ ఆ తర్వాత తను ఎదుర్కొన్న వేధింపుల గురించి వివరించింది. అనేకమంది అలా రియాక్ట్ అయ్యేందుకు కారణం అయ్యింది. అలాంటి ఆమె చేసిన ఫిర్యాదుకు ఆధారాలు లేవని పోలీసులు తేల్చారు.

ఆ కేసును క్లోజ్ చేస్తున్నట్టుగా వారు ప్రకటించారు. ప్రస్తుతం తనూశ్రీ ఇండియాలో లేదు. ఆమె కొంతకాలం కిందటే అమెరికా తిరిగి వెళ్లిపోయింది. ఈ వ్యవహారంపై ఆమె ఎలా స్పందిస్తుందో!



Note: Please DO NOT use ABUSIVE language in comments.