• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

మొత్తానికి రవితేజ - గోపీచంద్ మలినేని సినిమా హీరోయిన్ గా శృతిహాసన్ కన్ ఫర్మ్ అయింది. ఇన్నాళ్లు వార్తల్లో నానిన ఈ విషయం, అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయడంతో ఫైనల్ అయిపోయింది. బలుపు సినిమా తరువాత మళ్లీ రవితేజ-శృతిహాసన్-గోపీచంద్ మలినేని కాంబినేషన్ రిపీట్ చేయడానికి రంగం సిద్దమయింది.

శృతి హాసన్ తెలుగులో చేసి చాలాకాలం అయింది. రేసుగుర్రం, శ్రీమంతుడు తరువాత మళ్లీ తెలుగు తెరపై కనిపించడం ఇదే. దాదాపు మూడు నాలుగేళ్ల గ్యాప్ తరువాత శృతి హాసన్ తెలుగులో కనిపించబోతోంది. అలాగే విన్నర్ తరువాత గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమా ఇదే.

గోపీచంద్ మలినేని-బుర్రాసాయి మాధవ్ టీమ్ ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ మీద బిజీగా వుంది. ప్రస్తుతం రవితేజ చేస్తున్న డిస్కోరాజా సినిమా ఫినిష్ కాగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. టాగోర్ మధు నిర్మాత.Note: Please DO NOT use ABUSIVE language in comments.