• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

''నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని.
ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు.
నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం.
నిజాన్ని నిజమని చెబుతాను.
అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను.
మంచిని మంచి అనే అంటాను.
చెడును చెడు అనే అంటాను.
న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను.
అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను.
ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని.
నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను.
నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని.
భయం నా రక్తంలో లేదు.
రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు.
ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు.'' 

అంటూ ఒక సుదీర్ఘమైన పోస్టునే పెట్టాడు తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని. ఫేస్ బుక్ వేదికగా కేశినేని నాని లొల్లి కొనసాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీని వీడేది లేదని ప్రకటించి, మళ్లీ ఇలాంటి పోస్టులతో ఆ పార్టీ వాళ్లకు చుక్కలు చూపుతున్నారీయన.

ఈ పోస్టులు తెలుగుదేశం పార్టీ వీరాభిమానులకే ఏ మాత్రం నచ్చడం లేదు! ఆ విషయం ఈ పోస్టుల కామెంట్లతోనే స్పష్టం అవుతోంది. 'స్వయంశక్తి' ఎదిగినట్టుగా కేశినేని చెప్పుకుంటున్నారు. ఆ విషయాన్ని టీడీపీ వీరాభిమానులు ఖండిస్తూ ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ గుర్తు మీద నెగ్గిన వ్యక్తి 'స్వయంశక్తి'తో ఎదగడం ఎలా అవుతుంది? అని కేశినేని నానిని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం అభిమానులు. కామ్ గా ఉండాలి తప్ప.. ఇలా పార్టీ పరువును రచ్చకు ఈడ్చవద్దని వారు వాపోతున్నారు. అయితే అలాంటి వారి హెచ్చరికలను కేశినేని నాని పట్టించుకునేలా లేరు!



Note: Please DO NOT use ABUSIVE language in comments.