• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో భారతీయ జనతా పార్టీ వాళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చింది నిజమేనని తెలుస్తోంది. విపక్ష పార్టీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం దక్కనుందని సమాచారం. గత పర్యాయం అన్నాడీఎంకేకు ఆ అవకాశం ఇచ్చింది మోడీ సర్కారు.

జయలలితతో సత్సంబంధాలు కోరుకుంటూ లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆ అన్నాడీఎంకే ఎంపీకి ఇచ్చింది కమలదళం. ఈసారి కూడా ఒక ప్రాంతీయ విపక్ష పార్టీకి ఆ అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టుగా ఉంది.

ఈ పదవిని శివసేన కోరుతూ ఉంది. అయితే బీజేపీ ఆ విషయంలో స్పందించడం లేదు. బీజేడీ , జేడీయూలను కూడా ఈ విషయంలో పరిగణనలోకి తీసుకున్నారట మోడీ, షా. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చే ఉద్దేశం కూడా ఉందట. ఈ విషయంలో కమలనాథులు బయటకు ఏదీ చెప్పడంలేదు. తమకు తగిన పార్టీని ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు.

డిప్యూటీ స్పీకర్ పదవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేయగా, ఆ పార్టీ  అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో నిర్ణయానికి కాస్త సమయం కావాలని కోరినట్టుగా సమాచారం. డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడమా, వద్దా అనే అంశం గురించి జగన్ సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.



Note: Please DO NOT use ABUSIVE language in comments.