• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్లో కచ్చితంగా ఉంటుందనుకున్న పేరు ఆర్కే రోజా. ఆమెకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా తన కేబినెట్లో చోటు ఇస్తారని అందరూ అనుకున్నారు. విశ్లేషణలన్నీ అలాగే సాగాయి. అయితే అనూహ్యంగా ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు జగన్ మోహన్ రెడ్డి.

ఈ నేపథ్యంలో రోజాకు మంత్రిపదవి దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగానే నిలుస్తూవస్తోంది. ఇక సోషల్ మీడియాలో రోజాకు గట్టి ఫాలోయింగ్ ఉండటం, ఆమె సినీనటి కూడా కావడంతో ఆమెకు మంత్రిపదవి దక్కలేదు అనే అంశం బాగా హైలెట్ అవుతూ ఉంది.

ఈ క్రమంలో ఈ అంశం మీద రోజా స్వయంగా స్పందించారు. మంత్రిపదవి దక్కనందుకు అసంతృప్తి ఏమీలేదని రోజా ప్రకటించారు. అమరావతికి వెళ్లిన రోజా.. అసెంబ్లీ సమావేశాల కోసమే తను వచ్చినట్టుగా తెలిపారు. అంతకు మించి రీజన్ ఏమీ లేదని, తనను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పిలిపించింది ఏమీ లేదని రోజా స్పష్టం చేశారు.

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలోనే తను అమరావతికి చేరుకున్నట్టుగా రోజా వివరించారు. తనను మాట్లాడటానికి సీఎం పిలిస్తే తప్పుకుండా వెళ్తానని, కుల సమీకరణాల్లో భాగంగానే తనకు మంత్రిపదవి దక్కకపోయి ఉండొచ్చని రోజా అభిప్రాయపడ్డారు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.