• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ఆంధ్రప్రదేశ్ కు నూతన గవర్నర్ నియమితం కానున్నారని, అది మరెవరో కాదు సుష్మా స్వరాజ్ ఏపీకి గవర్నర్ గా రాబోతున్నారన్న ఊహాగానాలకు తెరపడింది. ఆ విషయంలో స్వయంగా ఆమె స్పందించారు. ట్విటర్ ద్వారా స్పందించి రూమర్లకు చెక్ పెట్టారు ఈ కేంద్ర మాజీమంత్రి. తను ఏపీకి గవర్నర్ గా నియమితం కాబోతున్నట్టుగా వస్తున్న వార్తలు అబద్ధమని ఆమె తేల్చిచెప్పారు.

తద్వారా తన విషయంలో వస్తున్న రూమర్లకు, ఏపీ గవర్నర్ విషయంలో చెలరేగిన ఊహాగానాలకు ఆమె చెక్ పెట్టారు. నరసింహన్ ను మారుస్తున్నారని, ఏపీకి-తెలంగాణకు వేర్వేరు గవర్నర్ లు రానున్నారని వార్తలు వచ్చాయి. ఏపీ బాధ్యతలను సుష్మాస్వరాజ్ కు అప్పగిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటన్నింటికి సుష్మాస్వరాజ్ ఒకే ట్వీట్ తో చెక్ చెప్పారు.

తను ఏపీకి గవర్నర్ గా రావడంలేదని ఆమె తేల్చిచెప్పారు. మరి సుష్మ స్థానంలో వేరొకరు ఏపీకి గవర్నర్ గా వస్తారో లేక, నరసింహనే ఎంచక్కా కొనసాగుతారో!



Note: Please DO NOT use ABUSIVE language in comments.