• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో మాజీ స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ రావు కుటుంబం నుంచి బాధింపబడ్డ వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. తమతో కోడెల కూతురు, కొడుకు ఏ మేరకు వసూళ్లకు పాల్పడ్డారో వివరిస్తూ వారు పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి బిల్డర్లు కోడెల దూడల బాధితులుగా ఉన్నట్టున్నారు. 

సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో చాలామంది బిల్డర్ల నుంచి కోడెల కొడుకు శివరాం వసూళ్లకు పాల్పడినట్టుగా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. అపార్ట్ మెంట్లు నిర్మించిన వాళ్లతో ఒక్కో ఫ్లాట్ కూ కొన్ని లక్షల రూపాయల చొప్పున వసూలు చేశాడట కోడెల శివరాం. కే ట్యాక్స్ కడితేనే పనులు సజావుగా సాగుతాయని లేకపోతే ఇబ్బందేనని బెదిరించి తమతో డబ్బులు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు.

ఇన్నిరోజులూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో తాము బయటకు రాలేకపోయినట్టుగా, ఇప్పుడైనా పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు. ఇక ప్రభుత్వ తరఫున ఏవైనా చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేపట్టిన వారితో కూడా కోడెల శివరాం వసూళ్ల దందాను సాగించినట్టుగా మరి కొన్ని ఫిర్యాదులు పోలీసులకు అందాయి. 

ఆఖరికి ప్రభుత్వ కార్యక్రమాల్లో భోజనాల ఏర్పాటు కాంట్రాక్టును తీసుకున్న వాళ్ల చెక్కులు పాస్ కావాలన్నా, కే ట్యాక్స్ వసూలు చేశారని, చెక్కులు గుంజేసుకుని, కే ట్యాక్స్ కట్టిన తర్వాతే వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వాళ్లంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు. తాము ఎంత ఇచ్చుకున్న వైనాలను కూడా వివరిస్తూ ఉన్నారు. మరి ఈ వ్యవహారంలో కోడెల దూడలపై చర్యలు ఏముంటాయో!



Note: Please DO NOT use ABUSIVE language in comments.