• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వసూళ్లు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కొడుకు కోడెల శివరాం మీద, కూతురు పూనాటి విజయలక్ష్మి మీద కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. వీరి బాధితులు ఒక్కొక్కరుగా పోలీసుల వద్దకు వస్తూ ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో వీరికి ఇన్నాళ్లూ భయపడి కప్పాలు కట్టిన చాలామంది ఇప్పుడు తాము ఎదుర్కొన్న బెదిరింపులకు సంబంధించి పోలీసులకు ధైర్యంగా వచ్చి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. విలువైన భూములను, అమాయకుల ఆస్తులను కోడెల కూతురు, కొడుకు టార్గెట్ చేశారనేది బలంగా వినిపిస్తున్న ఆరోపణ. ఆ ఆస్తులను కలిగి ఉన్న వారెవరైనా కోడెల  కుటుంబానికి కప్పం కట్టాల్సిందేనట. 

ఎవరైనా అపార్ట్ మెంట్స్ నిర్మిస్తూ ఉంటే.. అందులో ఒక్కో ఫ్లాట్ కు ఇంత అని కోడెల కుటుంబానికి చెల్లించుకోవాల్సిందేనట. అలా బిల్డర్ల నుంచి, ఆస్తుల కలిగిన అమాయకుల నుంచి కోడెల కుటుంబీకులు భారీగా వసూళ్లు సాగించినట్టుగా ఆరోపణలున్నాయి. అధికారం ఉంది కాబట్టి ఇన్నాళ్లూ వీళ్ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసినవారు లేరు. చేసినా పోలీసులు కూడా తీసుకోలేదని అంటారు.

అయితే ఇప్పుడు బాధితులు మాత్రం పోలిస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వారి బాదితులు పుట్టల్లోంచి వచ్చే చీమల తీరున బయటకు వస్తూ ఉన్నారు. కోడెల  కొడుకు మీదా ఇప్పటికే కేసు నమోదు అయ్యింది, ఇప్పుడు కోడెల కూతురు మీదా కేసు నమోదు అయ్యిందని పోలీసులు ప్రకటించారు. మొత్తానికి అధికారం ఉందని చేసిన దందాలకు ఇప్పుడు ప్రతిఫలాలను కోడెల కుటుంబం చెల్లించుకోవాల్సిందేనేమో!



Note: Please DO NOT use ABUSIVE language in comments.
1 Comments