• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు హీరోగా ఉయ్యాలవాడ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ 2 ‘సైరా’ విడుదల అంటూ ప్రచారం జరగుతోంది. ఇక దేశంలోని పలు భాషల్లో తెరకెక్కుతున్న ‘సైరా’ సినిమా మీద భారీగానే అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ‘సైరా’ బిజినెస్‌ని రామ్ చరణ్ చాలా చాకచక్యంగా జరుపుతున్నాడు. ఇప్పటికే ‘సైరా’ ఇతర భాషల హక్కులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

బాహుబలి తర్వాత మళ్ళీ అంత రేంజ్ ఉన్నది సైరా కావడంతో.. సైరా హిందీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే సైరా హిందీ హక్కులను చరణ్ ‘ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థకు డీల్ సెట్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ సంస్థ సైరా హక్కులను భారీ, ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ‘సైరా’ కి హిందీ హక్కుల కింద ఎంత వచ్చిందో..? అనేది క్లారిటీ రాలేదు కానీ.... భారీ మొత్తంలో వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక ‘సైరా నరసింహారెడ్డి’కి హిందీలో అంతగా క్రేజ్ రావడానికి ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా నటించడంతో... అంత క్రేజ్ ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్.Note: Please DO NOT use ABUSIVE language in comments.