• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ హీరోయిన్ అనుష్కతో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారని, దాన్ని మైత్రీమూవీస్ నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. ఈ సంగతి అలా వుంచితే మరో యూనిట్ కూడా అనుష్కతో ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ, ఆ మధ్య కళ్యాణ్ రామ్ తో ‘నా నువ్వే’ సినిమాను నిర్మించిన ఎల్ ఎ తెలుగు మూవీస్ సంస్థ తన మలిప్రయత్నంగా ఓ సిన్మాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ స్టేజ్ లో వున్న ఈ ప్రాజెక్టుకు లీడ్ గా కొత్త దర్శకుడు వ్యవహరిస్తారు. ఈ సబ్జెక్ట్ పక్కా లేడీ ఓరియెంటెడ్, ఇంకా అనుష్కకు పూర్తిగా సూటబుల్ అంట.

అందువల్ల ఆ దిశగా డిస్కషన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. నానువ్వే తరువాత ఏంచేయాలి అన్నది క్లియర్ గా డిసైడ్ అయితే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది. ఈ సబ్జెక్ట్ పై వర్క్ చేయిస్తూనే, మరో మాంచి మాస్ సినిమా చేసే ఆలోచనతో కూడా అదే యూనిట్ వుంది. అనుష్క సినిమానే ముందుగా పట్టాలు ఎక్కే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది.



Note: Please DO NOT use ABUSIVE language in comments.