• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. కొన్నేళ్లుగా వినిపిస్తున్న డిమాండ్ ఇది. తెలుగుదేశం పార్టీ ఈఅంశంపై ఎప్పుడో "తెప్ప తగలేసింది". ఆ పార్టీ ఆదేశాలతో జనసేనాని కూడా ఈటాపిక్ ను మెల్లగా సైడ్ చేశారు. కొన్ని స్వతంత్ర్య సంస్థలతో పాటు వైఎస్ఆర్సీ పార్టీ మాత్రం దీనిపై గట్టిగా పోరాడుతోంది. ఇలాంటి టైమ్ లో ఊహించని విధంగా ఓ హీరో దీనిపై స్పందించాడు. అతడే  నిఖిల్.

"నేను కేవలం ఓ నటుడ్ని మాత్రమే. నీకు ఇవి ఎందుకని చాలామంది నన్ను ప్రశ్నించొచ్చు. కానీ ఏపీలో ఈమధ్య కాలంలో నేను షూటింగ్స్ చేశాను. ఏపీ అభివృద్ధికి ఇంకా ఎంతో పనిచేయాలి. ఇంకెంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. భారీగా నిధులు వచ్చినప్పుడు మాత్రమే ఏపీలో నగరీకరణ సాధ్యం. ఓ తెలుగువాడిగా, భారతీయుడిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాను." నిఖిల్ ట్వీట్ ఇది.

భౌగోళికంగా నిఖిల్ కు ఆంధ్రాతో ఎలాంటి సంబంధం లేదు. హైదరాబాద్ లో పుట్టిపెరిగాడు ఈహీరో. ఇలాంటి నటుడు ఏపీ స్పెషల్ స్టేటస్ పై కాస్త ఘాటుగా స్పందించడం అందర్నీ ఆకర్షించింది. మరీ ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిన ఇలాంటి సమయంలో నిఖిల్ ట్వీట్ సంచలనం సృష్టించింది.

ప్రస్తుతం నిఖిల్ ట్వీట్ కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎంతోమంది నటులు, మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత మూలాలు కలిగిన నటులు నిఖిల్ ను చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ సినిమాల కోసం మాత్రమే ట్వీట్లు చేసే సినీహీరోలు, నిఖిల్ తరహాలో ప్రత్యేక హోదాపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.