• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు కొత్త థియరీతో వెళ్తున్నట్లుంది. ఆయన స్పీడున్నోడు అంటూ ఓ ఫ్లాప్ తో మైనస్ లో వున్నారు. ఆయన చేస్తున్న లేటెస్ట్ ప్రయత్నం అంతా ఇలా మైనస్ ల చుట్టూనే తిరుగుతోంది. వరుస ఫ్లాపులతో రికార్డు సృష్టించిన సునీల్ ఒక హీరో. అన్నీ ఫ్లాపులే అన్నట్లుగా సినిమాలు అందించిన అల్లరి నరేష్ మరో హీరో. 

ఇలా ఇద్దరు ఫ్లాప్ ట్రాక్ రికార్డుతో వున్న హీరోలతో చేస్తున్న సినిమాకు ముగ్గురు హీరోయిన్లు కావాలి. అందుకోసం ఇద్దరు ఫ్లాపు హీరోయిన్లను పట్టుకువచ్చారు. ఒక హీరోయిన్ పూర్ణ. ఆమె ఎన్ని సినిమాలు చేసిందో? వాటిల్లో ఎన్ని ప్లాపులో.

ఆ లెక్క అంతా సినిమా జనాలకు తెలిసిందే. ఇక మరో హీరోయిన్ లేటెస్ట్ గా ఫ్లాప్ ఇచ్చి చిత్ర శుక్ల. హీరో రాజ్ తరుణ్ తో రంగులరాట్నంలో వేసిన అమ్మాయి. కాస్త పెద్దగా కనిపించడంతో, పోలీస్ క్యారెక్టర్ కు సూటవుతుందని తీసుకున్నారు.

ఇలా ఇద్దరు ఫ్లాప్ లతో వున్న హీరోలు, ఇద్దరు అలాంటి హీరోయిన్లతో తయారవుతున్న ఈ సినిమాకు మరో హీరోయిన్ గా మాత్రం నందినీ రాయ్ ని ఎంపిక చేసారు. సుడిగాడు, స్పీడున్నోడు మాదిరిగానే ఈ సినిమా కూడా తమిళ సినిమా ఆధారంగా తెరకెక్కుతోంది.

 
 



Note: Please DO NOT use ABUSIVE language in comments.