• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

బహుశా వచ్చేసారి గెలిచి మళ్లీ అమెరికాకు అధ్యక్షుడు కావాలనే ఆశలు ఏమైనా ఉంటే.. వాటిని డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడే తుంచేసుకుంటే మంచిదేమో. ఎందుకంటే.. ఇప్పటి నుంచి ఆశలు పడి, అప్పుడు చంద్రబాబు చేతిలో చిత్తుగా ఓడి, నిరాశ పడటం కంటే.. తెలుగుదేశం వస్తోంది.. అనే విషయాన్ని అర్థం చేసుకుని ఇప్పుడే ఆశలు వదిలేసుకోవడం మంచిది కదా!

ట్రంప్ లాంటి తెంపరి మాత్రమే కాదు.. అమెరికా అధ్యక్ష పీఠం కోసం వచ్చేసారి బరిలో నిలుస్తానని అంటున్న ఒకానొక నల్ల వజ్రం ఓప్రా విన్ ఫ్రే వంటి వాళ్లు కూడా ఇక అలర్ట్ కావాలి. వచ్చేసారి తాము పోటీ చేయడం వేస్ట్.. అని ఆమె కూడా అర్థం చేసుకోవాలి. ట్రంప్ తో పోటీపడటం కాదు.. ట్రంప్ కే మచ్చెమటలు పట్టించే చంద్రబాబు నాయుడు వచ్చేసారి అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేట్టుగా ఉన్నాడు మరి.

సో.. ఓప్రా కూడా నిట్టూర్చడానికి సమయం ఇదే. ఇంకా ఎవరండీ.. నిక్కీ హేలీనా? ఆర్నాల్డా? అలాగే.. ‘అత్తమ్మ’ హిల్లరీ కూడా.. అవాక్కైపోయి ఉంటుంది. అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టాయి. అల్లకల్లోలం మొదలైంది. హాలీవుడ్ లోనూ ఇదేచర్చ.. వచ్చేసారి పార్టీ ఫండ్స్ ఎవరికీ వద్దు.. మొత్తమంతా తెలుగుదేశానికే ఇద్దామని అక్కడి నటీనటులు తీర్మానించుకుంటున్నారట.

ఇంతకీ.. ప్రకంపనలు పుట్టడానికి కారణం లోకేష్ బాబే అని వేరే చెప్పనక్కర్లేదు. అక్కడ తమ పార్టీ వాళ్ల ఉత్సాహాన్ని చూసి.. లోకేష్ బాబు అన్నారట. ‘మీ ఉత్సాహాన్ని చూస్తుంటే.. అమెరికాలో కూడా తెలుగుదేశమే అధికారంలోకి వచ్చేసేలాగా ఉంది.. ’ అని. ఇది చాలదూ.. అమెరికాలో అలజడి పుట్టడానికి. తెలుగుదేశం పార్టీని అమెరికాలో ఎన్నికల బరిలో నిలుపుతున్నారన్నమాట. అదిరిపోతుందిలే ఇక.

నిన్నటి వరకూ తెలుగుదేశం పార్టీని ఎన్నికల కమిషన్ గుర్తించని జాతీయ పార్టీగా చూశాం, ఇప్పుడు అమెరికాలో గెలుపు.. అనేమాటతో ఇది అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. మరి అమెరికాతో ఆగిపోతారా? లేక పక్కనే ఉన్న కెనడాను, ఇంకోవైపున్న మెక్సికోలో కూడా గెలిచేసి.. ఆపై యూరప్ లో విజయంతో.. చంద్రబాబును ప్రపంచానికి ఏకగ్రీవంగా నియంతగా నిలపబోతున్నారా? లోకేష్ బాబే చెప్పాలి!



Note: Please DO NOT use ABUSIVE language in comments.