• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టయిలిష్ స్టార్, వరుణ్ తేజ్.. వీళ్లంతా నాకు పంచభూతాలతో సమానం. నేను వాళ్ల కోసం ఏమైనా చేస్తాను. నా ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీ. రెండో ఆలోచన లేకుండా వాళ్లకు నేను నా ప్రాణాలు అర్పించేసుకుంటాను." ఇంటిలిజెంట్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో సాయిధరమ్ తేజ్ మాటలివి. 

మెగా కుటుంబంలో సభ్యుడు కాబట్టి ఆ హీరోలపై ప్రేమ ఉండడం సహజం. కానీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో తేజూ చెప్పిన ఈ మాటలు మాత్రం చాలా అసహజంగా ఉన్నాయి. ఎలాంటి సందర్భం లేకుండా "ప్రాణాలు అర్పించేసుకుంటా" అంటున్నాడు తేజు. మరీ ముఖ్యంగా మెగా హీరోలు ఐదుగుర్ని పంచభూతాలుగా వర్ణిస్తూ, వాళ్ల కోసం దేనికైనా రెడీ అంటూ డైలాగులు చెప్పడం నవ్వు తెప్పించింది. 

కేవలం ఇంటిలిజెంట్ ప్రమోషన్ కోసమే మెగాహీరోల్ని ఇలా కావాలని పొగుడుతున్నాడనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అందులో తప్పులేదు కూడా. కానీ ఇలా పంచభూతాలు, ప్రాణాలు అర్పిస్తా లాంటి డైలాగులు మాత్రం మరీ వెగటు పుట్టించాయి.

తన ప్రసంగంలో భాగంగా తొలిప్రేమ సినిమా గురించి మరోసారి స్పందించాడు తేజూ. తనకు వరుణ్ తేజ్ కు ఎలాంటి పోటీ ఉండదన్నాడు. ఇక్కడ కూడా కాస్త అతిగా మాట్లాడేశాడు. "బావ ఎప్పుడూ బావమరిది మంచే కోరుకుంటాడు. తొలిప్రేమ కూడా పెద్ద హిట్ అవ్వాలి. అయినా వాడితో నాకు పోటీ ఏంటి. చిన్నప్పట్నుంచి వాడ్ని (వరుణ్ తేజ్) ఎత్తుకొని నా చేతులతో పెంచాను. వాడి సినిమా హిట్ అయితే నేనెంతో హ్యాపీ." ఇలా వరుణ్ తేజ్ గురించి కూడా అతిగా రియాక్ట్ అయ్యాడు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.