• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

కొత్త దర్శకుడు వెంకీ కుడుముల అందించిన ఛలో సినిమా ఫస్ట్ వీకెండ్ లో మంచి ఫలితాలు నమోదు చేసింది. సినిమా అమ్మిన రేట్లకు, విడుదలైన థియేటర్లకు లెక్క వేసి చూసుకుంటే మాంచి ఫలితాలను నమోదు చేసిందనే చెప్పాలి.

తొలి మూడు రోజులకు కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మూడున్నర కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఏడెనిమిది కోట్ల చిన్న బడ్జెట్ తో తయారైన సినిమా. చాలా తక్కువ రేట్లకు, అది కూడా ఎక్కువగా అడ్వాన్స్ ల మీద ఇచ్చిన సినిమా ఇలా వసూళ్లు సాగించడం అంటే నిర్మాత అదృష్టమే. వెంకీ కుడుములకు ఇది తొలి సినిమా కావడం విశేషం.

నైజాం నిర్మాత తనే ఉంచుకున్నారు. అక్కడే కోటి ముఫై లక్షలకు పైగా వచ్చింది. ఉత్తరాంధ్ర 50లక్షల అడ్వాన్స్ మీద ఇస్తే అక్కడ ఇప్పటికే 59లక్షలు వచ్చింది. నెల్లూరు 20లక్షలకు ఇస్తే, ఫస్ట్ వీకెండ్ 12లక్షలు వసూలు చేసింది. అలాగే సీడెడ్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది.                                           

కలెక్షన్ల వివరాలు

నైజాం.....1.37
సీడెడ్.......0.62
వైజాగ్......0.59
ఈస్ట్........0.37
వెస్ట్.........0.28
కృష్ణ........0.39
గుంటూరు..0.38
నెల్లూరు.....0.12



Note: Please DO NOT use ABUSIVE language in comments.