• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

అనుకున్నట్లే జరిగింది.. పవన్ కళ్యాణ్ పవర్‌కి అమెరికా గడ్డ దద్దరిల్లింది.. కాలు మోపడమే ఆలస్యం బాక్సాఫీస్‌కి మూడు చెరువుల నీళ్లు తాగించడం మొదలెట్టేశాడు పవన్ కళ్యాణ్. ఓవరాల్‌గా 580 లొకేషన్స్‌లో ‘అజ్ఞాతవాసి’ని ప్రదర్శిస్తుండగా.. 400 కంటే తక్కువ లొకేషన్స్‌లో మిలియన్ మార్క్‌ని దాటేశాడు. అది కూడా కేవలం 11.20 గంటల షోస్ వరకేనండోయ్.

ఉదయం 7 గంటలకు $1,40,000 రాగా.. 8 గంటలకు $2,16,774 వచ్చాయి. ఇక 10.45 వచ్చేసరికి.. ఎవ్వరూ ఊహించని రీతిలో ఏకంగా $8,72,137 కలక్షన్లు వచ్చాయి. జస్ట్ నాలుగు గంటల వ్యవధిలో వేసిన షోస్‌కే ఈ స్థాయి వసూళ్ల వర్షం కురిపించిందంటే.. ఇక ఓవరాల్‌గా ప్రీమియర్స్ ముగిసేలోపే 2 మిలియన్లకుపైగా వసూళ్లు కొల్లగొడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు.

ఆల్రెడీ అమెరికాలో త్రివిక్రమ్‌కి ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. అతని మాటల మంత్రాలకి పడిపోయే జనాలు యూఎస్‌లో చాలా ఎక్కువ. అలాంటి మాంత్రికుడికి పవర్‌స్టార్ పవన్ కలిస్తే.. అదికూడా ముచ్చటగా మూడోసారి జతకడితే ఏమైనా ఉంటుందా? ఇదిగో ఈ కలెక్షన్ల సునామీనే ప్రత్యక్ష సాక్ష్యం. ఇది కేవలం ఆరంభమే.. మున్ముందు ‘అజ్ఞాతవాసి’ చర్యలు మరెంత ఊహాతీతంగా ఉంటుందో!


Note: Please DO NOT use ABUSIVE language in comments.