• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

శ్రీలంకన్‌ బ్యూటీ, బాలీవుడ్‌ భామ జాక్వెలైన్‌ ఫెర్నాండెస్‌, క్రిస్‌మస్‌ హాలీడేస్‌ని ఫుల్లుగా ఎంజాయ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తన సోదరుడితో కలిసి స్విమ్మింగ్‌ పూల్‌లో, అదీ బికినీలో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోని షేర్‌ చేసింది. తమ మధ్య వయసు గ్యాప్‌ చాలా తక్కువేననీ, నిజానికి తాము ట్విన్స్‌లా వుంటామనీ, అలాగే వ్యవహరిస్తామని పేర్కొంది జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. 

సోదరుడితో స్విమ్మింగ్‌ పూల్‌లో, అదీ బికినీతో.. 'వెరీ బ్యాడ్‌..' అని ఎవరైనా అనుకోవచ్చుగాక, ఇదిప్పుడు చాలా కామన్‌.! సోషల్‌ మీడియాలో ఫొటో షేర్‌ చెయ్యగానే సరిపోదు, దానికి వచ్చే కామెంట్స్‌ని భరించే ఓపిక కూడా కావాలి. జాక్వెలైన్‌కీ అలాంటి తిప్పలు తప్పడంలేదు. 'గ్రో అప్‌ కిడ్స్‌..' అంటూ ఈ ఫొటోకి వచ్చిన నెగెటివ్‌ కామెంట్స్‌పై స్పందిస్తూ జాక్వెలైన్‌ వ్యాఖ్యానిస్తోంది. 

మరోపక్క, 'ఇన్నర్‌ ఇంజనీరింగ్‌' అనే బుక్‌ని తెగ చదివేస్తోందట జాక్వెలైన్‌. న్యూ ఇయర్‌ వేడుకలకి ముందే ఈ పుస్తకాన్ని పూర్తి చేసేస్తానని జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ చెబుతోంది. హాలీడేస్‌ తర్వాత పూర్తిగా వర్క్‌లో (నటనలో) బిజీ అయిపోతానంటోన్న ఈ బ్యూటీ, కాస్త గ్యాప్‌ తీసుకుని మాల్దీవ్స్‌కి వెళ్ళాలనుకుంటున్నట్లు వెల్లడించింది. మాల్దీవ్స్‌ అంటే బికినీ రచ్చ.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!



Note: Please DO NOT use ABUSIVE language in comments.