• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

గణేష్ ఆచార్య. బాలీవుడ్ డ్యాన్స్ డైరక్టర్. ఆ లెవెల్ డ్యాన్స్ డైరక్టర్ ను తీసుకువచ్చారు డిజె సినిమా కోసం. నిజానికి బన్నీ సినిమాకు గణేష్ ఆచార్య పని చేయడం ఇది రెండోసారి. అయితే ఈసారి గణేష్ ఆచార్య వచ్చినా కూడా దాదాపు పాటలో చాలా భాగం బన్నీ సలహాలు సూచనలతోనే చిత్రీకరించారట. పైగా గణేష్ కూడా బన్నీ చెప్పిన భంగమలే సూపరంటే సూపర్ అని అనేసి సైలంట్ గా వుండిపోయినట్లు టాక్. 

తన రెమ్యూనిరేషన్ వచ్చేసింది. హీరో టాలెంట్ కు సై అంటే మళ్లీ మరో సినిమాకు పిలుస్తారు. లేదంటే లేదు. అందుకే కావచ్చు గణేష్ ఆచార్య కూడా బన్నీ పాట కొరియోగ్రఫీలో దూరినా సైలెంట్ అయ్యారని వినికిడి. కానీ గమ్మత్తు ఏమిమంటే, తీరా పాట ఫారిన్ లోకేషన్ లో చేసి వచ్చేసినా, కొన్ని చోట్ల సరిగ్గా రాలేదట. దాంతో ప్యాచ్ వర్క్ లు చేయక తప్పదట. 

అన్ని డబ్బులు ఇచ్చి గణేష్ ఆచార్యను తేవడం ఎందుకో? మళ్లీ ఈ దూరిపోవడాలు, ప్యాచ్ వర్కులు ఎందుకో అంటున్నాడట దగ్గర వాళ్ల దగ్గర ఆఫ్ ది రికార్డుగా డైరక్టర్ హరీష్ శంకర్.



Note: Please DO NOT use ABUSIVE language in comments.