• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ఉగాదికి మహేష్ తో పాటు నాగచైతన్య కూడా రెడీ అవుతున్నాడు. ఈ ఉగాదికి మహేష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ లో ఒకటి గ్యారెంటీగా వస్తుంది. మహేష్ తో పాటు చైతూ కూడా తన కొత్త సినిమాతో ఉగాదికి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా,  కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు చైతూ. వీటిలో కల్యాణ్ కృష్ణ సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాదికి లాంచ్ చేయాలని నిర్ణయించారు.

టైటిల్ తో ఈ సినిమా ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. రారండోయ్ వేడుక చూద్దాం అనే డిఫరెంట్ టైటిల్ ను ఈ మూవీకి పెట్టారు. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ లుక్ ను చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఆమెకు సంబంధించిన దుస్తులు, మేకప్ ఏదీ బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో రకుల్ పల్లెటూరి పిల్లగా కనిపించనుందని తెలుస్తోంది. బహుశా చైతూతో పాటు రకుల్ ఉండే ఫొటోను ఉగాదికి విడుదల చేసే ఛాన్స్ ఉంది.

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. జులైలో సినిమాను రిలీజ్ చేయాలనేది ప్లాన్.



Note: Please DO NOT use ABUSIVE language in comments.