• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

కాటమరాయుడు సినిమా విడుదలకు ఓ రోజు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హడావుడి ట్విట్టర్ లో స్టార్ట్ అయింది. సుమార్ మూడు లక్షలకు పైగా ఫాలోవర్స్ వున్న కమైర్ ఖాన్ (కెఆర్కే) పవన్ పై ఘాటు కామెంట్ పెట్టారు. అలాగే హైదరాబాద్ లో సర్దార్ సినిమా బయ్యర్ చేస్తున్న దీక్ష ఫొటో పోస్టు చేసారు. అక్కడితో ఆగకుండా తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ చీటర్ గా మారారు, డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్ ను ఎనిమిది కోట్ల మేరకు చీట్ చేసారు అంటూ ట్వీట్ చేసారు. 

దాంతో పవన్ ఫ్యాన్ కేఆర్కే పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. పనిలో పనిగా మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ కామెంట్లలో చేరారు. ఇలా మొత్తం మీద ముప్పేట దాడి మొదలయ్యింది ట్విట్టర్ లో. పవన్ ఫ్యాన్స్ కేఆర్కే పై విరుచుకు పడుతుంటే, పవన్ ఏంటీ ఫ్యాన్స్ ఆయన పెళ్లిళ్లు తదితర వ్యవహారాలను ప్రస్తావిస్తున్నారు. పనిలో పనిగా తెలుగు మీడియా సర్దార్ బయ్యర్ దీక్ష ను అస్సలు పట్టించుకోవడం పై కూడా కామెంట్ లు పడుతున్నాయి. 

మొత్తానికి ట్విట్టర్ లో సర్దార్ కమ్ పవన్ తేనె తుట్ట కదిలింది.



Note: Please DO NOT use ABUSIVE language in comments.