• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

వన్డే, టీ20ల కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ధోనీ తప్పుకోలేదు.. తప్పించారు అనేది ప్రధానమైన ఆరోపణ. బోర్డులో సంభవించిన అనేక పరిణామాలతోనే ధోనీ కెప్టెన్సీని త్యజించాడని వార్తలు వస్తున్నాయి. శ్రీనివాసన్ బీసీసీఐ పదవి నుంచి వైదొలగడంతోనే ధోనీకి ఇబ్బంది మొదలైందని, ధోనీ తరపున వకల్తా పుచ్చుకునే వారు లేకుండా పోయారని.. తదనంతర పరిణామాల్లో బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లు ధోనీకి పొగబెట్టారని అంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ఖండించాడు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.