• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

'ఖైదీ నెంబర్ 150' సంక్రాతి కానుకగా విడుదల చెయ్యడానికి నిర్మాత రామ్ చరణ్, డైరెక్టర్ వి.వి.వినాయక్ లు ప్లాన్ చేశారు. ఈ మధ్యనే డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ అయిన 'ఖైదీ...' పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. ఇక 'ఖైదీ....' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని జనవరి 4 న గ్రాండ్ గా జరిపించాలని నిర్మాత రామ్ చరణ్ భావించాడు. ఇక ఈ ఫంక్షన్ ని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరపాలని అనుకున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం నుండి అనుమతి లభించకపోవడంతో ఈ ఈవెంట్ ని వాయిదా వెయ్యాలని రామ్ చరణ్ డిసైడ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. 

అయితే ఈ ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని విజయవాడ - గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ లో ఈ నెల 7 న భారీగా చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ ఫంక్టన్ కి మెగా అభిమానులతోపాటు మెగా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా హాజరవుతారని ప్రచారం జరుగుతుంది.  ఈ ఫంక్షన్ ని భారీ ఎత్తున జరపడం వల్ల విజయవాడలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లవచ్చని ప్రభుత్వం భావించి ఈ ఈవెంట్ కి అనుమతి నిరాకరించడం వల్ల.. వెన్యూ మార్చాల్సి వచ్చిందని రామ్ చరణ్ చెబుతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని జనవరి 11  న విడుదల చేస్తామని చెప్పాడు. 

ఇప్పటికే ఖైదీ నెంబర్ 150  ఆడియో వేడుక భారీ లెవల్లో చేస్తామని చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆడియో ని క్యాన్సిల్ చేసి పాటలను డైరెక్టుగా మార్కెట్ లోకి వదిలేశారు. దీనితో మెగాభిమానులు తీవ్ర నిరాశకు లోనైయ్యారు.  ఇక ఇప్పుడు 'ఖైదీ...' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని కూడా జనవరి 4  న కాకుండా మళ్ళీ 7  కి మార్చారు. పాపం 'ఖైదీ నెంబర్ 150' అంటూ 9  ఏళ్ళ తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇస్తున్న చిరుకే ఎందుకిలా జరుగుతుంది అని మెగా అభిమానులు కొంచెం టెంక్షన్ పడుతున్నట్టు సమాచారం.Note: Please DO NOT use ABUSIVE language in comments.