• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

‘కాటమరాయుడు’ విషయంలో అభిమానులకు అసలైన ట్రీట్ ఇంకా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్. అప్పట్లో పవన్ ఏదో కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను జత చేసి టైటిల్ లోగోతో ఒక డిజైన్ తయారు చేయించి.. అదే ఫస్ట్ లుక్ అనేసింది ‘కాటమరాయుడు’ టీమ్. ఆ తర్వాత దీపావళికి రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఏమంత కిక్ ఇవ్వలేదు. ఈ ఫీడ్ బ్యాక్ ‘కాటమరాయుడు’ టీంకు కూడా చేరింది. దీంతో ఇప్పుడు అభిమానులను రంజింపజేసేలా ఒక పూర్తి స్థాయి పోస్టర్ తో కొత్త సంవత్సరం తొలి రోజు పలకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని నిర్మాత శరత్ మరార్ కూడా ధ్రువీకరించాడు.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో ‘కాటమరాయుడు’ రెడీ అవుతున్నాడని.. ఈ విషెస్ ఎప్పుడు ఏ విధంగా చెబుతాడో త్వరలో వెల్లడిస్తామని నిన్న అర్ధరాత్రి ట్విట్టర్లో ప్రకటించాడు శరత్ మరార్. మరి ఈ కొత్త లుక్ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో.. అభిమానుల్ని ఏమేరకు అలరిస్తుందో చూడాలి. ఇటీవలే పవన్ కు బాగా అచ్చొచ్చిన పొల్లాచ్చిలో కొన్ని సన్నివేశాలు.. ఒక పాట చిత్రీకరించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంది ‘కాటమరాయుడు’ టీమ్. ఈ షెడ్యూల్ తో షూటింగ్ తుది దశకు వచ్చినట్లు సమాచారం. జనవరి నెలాఖరుకు షూటింగ్ పూర్తయ్యే అవకాశముంది. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆరు పాటలు సిద్ధం చేసేశాడు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.