• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

రీసెంట్ గా పుట్టిన కూతురు ఆర్హాతో బోలెడంత టైం స్పెండ్ చేస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఓ నెల్లాళ్లక్రితం బ్రేక్ వేసిన మూవీ డీజే-దువ్వాడ జగన్నాధంను కూడా ప్రారంభిచేయబోతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న డీజేను.. సమ్మర్ కల్లా రిలీజ్ చేసేయాలన్నది బన్నీ టార్గెట్.

ఒక వైపు సినిమా సక్సెస్ లను ఎంజాయ్ చేస్తున్న స్టైలిష్ స్టార్.. మరోవైపు యాడ్ ఎండార్స్ మెంట్స్ లో కూడా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పలు బ్రాండ్స్ కు ఎండార్స్ చేస్తున్న బన్నీ.. ఇప్పుడు మహా సిమెంట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన కెరీర్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడమే కాదు.. ఈ కంపెనీ సేల్స్ గ్రోత్ కోసం ఒప్పందం అగ్రిమెంట్ చేసుకున్నాడు బన్నీ. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ అభిమానులను అలరిస్తున్నాయి.

ఇప్పటికే బన్నీ పలు కంపెనీల ప్రకటనల్లో నటిస్తున్నాడు. హీరో మోటోకార్ప్.. లాట్ మొబైల్స్.. ఓఎల్ఎక్స్.. కోల్గేట్.. జాయలుక్కాస్.. 7అప్.. హాట్ స్టార్ యాప్ లకు ప్రచారం చేసిన బన్నీ ఖాతాలో.. ఇప్పుడు మహా సిమెంట్ అంటూ కొత్త కంపెనీ కూడా జతైంది.



Note: Please DO NOT use ABUSIVE language in comments.