• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ఒక సినిమాకి సంబంధించిన ట్రైలర్ కో.. టీజర్ కో యూట్యూబ్ లో విపరీతమైన క్లిక్స్ రావడం లాంటివి చూస్తూనే ఉంటాం. కానీ మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150కి సంబంధించిన ప్రతీ సందర్భానికి యూట్యూబ్ అదిరిపోయేలా వ్యూస్ క్లిక్స్ వస్తున్నాయి. ఖైదీ నంబర్ 150 టీజర్ తో మొదలైన ఈ స్పీడ్ ఏ స్థాయిలో తగ్గడం లేదు. ఈ టీజర్ కు ఇప్పటికే 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 

ఓ వారం క్రితం రిలీజ్ అయిన అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఆడియో సింగిల్ కి అయితే.. ఎవరూ ఊహించని రేంజ్ లో వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే 5 మిలియన్ల వ్యూస్ దాటిపోయి దూసుకుపోతోంది ఈ సింగిల్. ఇక రీసెంట్ గా డిసెంబర్ 24 సాయంత్రం విడుదల చేసిన సుందరి సాంగ్ పరిస్థితి కూడా ఇంతే. తెల్లారేసరికల్లా 1 మిలియన్ వ్యూస్ దాటిపోయాయంటే.. చిరంజీవి కంబ్యాక్ మూవీపై అభిమానులు ఎంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతుంది. ప్రమోషన్స్ విషయంలో ఖైదీ యూనిట్ పాటిస్తున్న స్ట్రాటజీలు బాగా వర్కవుట్ అవుతున్నాయనే చెప్పాలి. 

రోజురోజుకు ఖైదీకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోంది. ఇప్పుడు జనవరి 4వ తేదీన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను విజయవాడలో చేయబోతున్నట్లు అధికారికంగానే చెప్పేశారు. ఇదంతా చూస్తుంటే.. రిలీజ్ అయ్యాక ఖైదీ నంబర్ 150 ఎన్నెన్ని సంచలనాలకు వేదిక కాబోతోందో అనుకుంటున్నారు ట్రేడ్ పండిట్స్. 



Note: Please DO NOT use ABUSIVE language in comments.