• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ సినిమా ఒకటి కూడా విడుదల కాకుండానే.. 2016 పూర్తవుతోంది. ఎంట్రీ ఇచ్చాక ఏడాది వ్యవధిలోనే 3 సినిమాలు రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన వరుణ్ తేజ్.. ఆ వెంటనే లాంగ్ గ్యాప్ ఇచ్చేశాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ ఈపాటికే రావాల్సింది కానీ.. మధ్యలో వరుణ్ తేజ్ కి గాయం కారణం షూటింగ్ ఆలస్యం అయింది.

వైట్ల మూవీతో పాటు.. శేఖర్ కమ్ములతో చేస్తున్న ఫిదా చిత్రం కూడా ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. వీటిని పట్టాలెక్కించడంతోపాటు..  ఇప్పుడు తన తర్వాతి చిత్రాన్ని కూడా ఫైనల్ చేసేశాడట వరుణ్ తేజ్. స్నేహగీతం మూవీలో లీడ్ కేరక్టర్లలో ఒకడిగా నటించిన వెంకీ అట్లూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ మూవీ చేయనున్నాడట వరుణ్ తేజ్. నానితో కలిసి కృష్ణగాడి వీర ప్రేమగాధలో నటించిన మెహ్రీన్ కౌర్ పీర్జాడాను.. వరుణ్ తేజ్ కి జోడీగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ లో ప్రారంభించబోతున్నాడట వరుణ్ తేజ్.

ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలను తిరిగి పట్టాలెక్కిస్తున్న వరుణ్ తేజ్.. మార్చ్ లో శ్రీను వైట్ల మిస్టర్ ను.. సమ్మర్ తర్వాత ఫిదాను విడుదల చేసే అవకాశాలున్నాయి.



Note: Please DO NOT use ABUSIVE language in comments.