• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ఎట్టకేలకు తన క్యారెక్టర్ పై, తన పాత్ర నిడివిపై స్పష్టత ఇచ్చింది హీరోయిన్ ఇషారెబ్బా. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్రంలో నటిస్తున్న ఇషా.. తనది ఫుల్ లెంగ్త్ రోల్ అంటోంది.

"అరవింద సమేతలో నాది సెకెండ్ లీడ్. అంటే సెకెండ్ హీరోయిన్ అన్నమాట. ఫస్ట్ లీడ్ గా పూజాహెగ్డే నటిస్తోంది. సెకెండ్ లీడ్ అంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోయే క్యారెక్టర్ కాదు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రోల్ కూడా కాదు. సినిమా అంతా నేనుంటాను. చాలాచోట్ల ఎన్టీఆర్ పక్కనే ఉంటాను."

ఇలా సినిమాలో తన పాత్ర నిడివిపై క్లారిటీ ఇచ్చింది ఇషారెబ్బా. పనిలోపనిగా అరవింద సమేతలో తన క్యారెక్టర్ కూడా బయటపెట్టింది. అంతా అనుకుంటున్నట్టు తనది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ కాదంటోంది.

"అరవింద సమేతలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్. చాలా రెబల్ గా కనిపిస్తాను. ఇంతకు ముందు ఏ సినిమాలోనూ అలా కనిపించలేదు. సినిమాలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంది కానీ నేను మాత్రం హైదరాబాద్ అమ్మాయిగానే కనిపిస్తాను. కాస్త రెబల్ గా ఉంటాను. "

ఎన్టీఆర్ తో స్టెప్పులు కూడా వేస్తున్నానని తెలిపింది ఇషారెబ్బా. ప్రస్తుతం ఓ సెట్ సాంగ్ షూటింగ్ జరుగుతోందని, ఆగస్ట్ లో తనకు సంబంధించి మరో షెడ్యూల్ ఉంటుందని అంటోంది. ప్రస్తుతం సుబ్రమణ్యపురం, అరవింద సమేత సినిమాలు మాత్రమే చేస్తున్నానని తెలిపిన ఇషా.. ఎన్టీఆర్ సినిమాతో స్టార్ డమ్ ఆశిస్తోంది.



Note: Please DO NOT use ABUSIVE language in comments.